'ఆంధ్ర కింగ్ తాలూకా' టీజర్ టాక్!

ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ టాక్!
X
ఎనర్జిటిక్ స్టార్ రామ్ లేటెస్ట్ మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా'. ఇదొక సూపర్ స్టార్, ఆయన ఫ్యాన్ ఇతివృత్తంతో రాబోతుంది. సూపర్ స్టార్ గా ఉపేంద్ర కనిపించబోతుండగా.. ఫ్యాన్ రోల్ లో రామ్ అలరించనున్నాడు.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ లేటెస్ట్ మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా'. ఇదొక సూపర్ స్టార్, ఆయన ఫ్యాన్ ఇతివృత్తంతో రాబోతుంది. సూపర్ స్టార్ గా ఉపేంద్ర కనిపించబోతుండగా.. ఫ్యాన్ రోల్ లో రామ్ అలరించనున్నాడు. రామ్ కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో 'మిస్ శెట్టి మిస్ పోలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు.పి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే పాటలతో గ్లింప్స్, పాటలతో అలరించిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' నుంచి టీజర్ వచ్చేసింది.

సినిమా కథ గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. తన అభిమాన హీరో ఉపేంద్ర (ఆంధ్ర కింగ్) కోసం ఏదైనా చేసే ఓ వీరాభిమాని పాత్రలో రామ్ కనిపించబోతున్నాడు. ఈ ఫ్యాన్ జీవితంలో జరిగే సంఘటనల చుట్టూ కథ తిరుగుతుందని టీజర్ ను బట్టి తెలుస్తోంది. ఈ టీజర్ లో రామ్ మాస్ లుక్స్‌, పవర్‌ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటున్నాయి.

తన ఫేవరెట్ స్టార్ కోసం ఫ్యాన్స్ ఎలాంటి హడావుడి చేస్తారు.. అలాగే రామ్-భాగ్యశ్రీ మధ్య లవ్ స్టోరీ ఈ టీజర్ లో హైలైట్స్. ఇక 'ఫ్యాన్‌ ఫ్యాన్‌ అని గుడ్డలు చింపేసుకోవడమే కానీ.. నువ్వు ఒకడివి ఉన్నావని కూడా నీ హీరోకి తెలియదు' అనే మురళీ శర్మ డైలాగ్‌ టీజర్‌ చివరిలో హైలైట్‌గా నిలిచింది. మాస్‌, ఎమోషన్‌, కామెడీ యాక్షన్‌ మేళవించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నవంబర్‌ 28న వరల్డ్ వైడ్ గా రాబోతుంది.



Tags

Next Story