అల్లు అర్జున్ స్టైల్‌కు అమెరికా ఫిదా

అమెరికాలోని టాంపాలోని ‘నాట్స్ 2025’ (ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ) సంబరాల్లో టాలీవుడ్ ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, డైరెక్టర్ సుకుమార్, నటి శ్రీలీలలతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. 'తెలుగువారంటే ఫైర్ అనుకున్నారా.. వైల్డ్ ఫైర్!' అంటూ తనదైన పుష్ప స్టైల్ డైలాగ్‌తో అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. 'నాట్స్ అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్!' అంటూ మరో డైలాగ్ తోనూ అలరించాడు. ఈ సందర్భంగా విదేశాల్లోనూ మన సంస్కృతిని కాపాడుతున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. 'భారతీయులు ఎక్కడున్నా తగ్గేదేలే.. అందులోనూ తెలుగోళ్లు అస్సలు తగ్గేదేలే' అని తన స్పీచ్ తో ఆకట్టుకున్నాడు బన్నీ.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ, 'ఇది నా 50 ఏళ్ల ప్రస్థానం. నేను పరిచయం చేసిన అల్లు అర్జున్, శ్రీలీల ఈ వేదికపై ఉండటం ఎంతో గర్వంగా ఉంది. ‘అడవి రాముడు’లో అడవిని నమ్మి స్టార్ డైరెక్టర్‌య్యాను. సుకుమార్ ‘పుష్ప’లో అదే అడవిని నమ్మి స్టార్ డైరెక్టర్ అయ్యాడు' అని చెప్పారు.
దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ, ''1 నేనొక్కడినే’ సినిమాను అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు ఆదరించడంతో నా కెరీర్‌కు కొత్త దారి తెరచింది' అన్నారు. ఈ వేడుకలో శ్రీలీల డ్యాన్స్‌తో అలరించగా, బన్నీ, సుకుమార్, శ్రీలీల కలిసి దిగిన సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తంగా ‘నాట్స్ 2025’ వేడుకలు తెలుగు సినీ ప్రియులకు మరిచిపోలేని జ్ఞాపకంగా నిలిచాయి.
-
Home
-
Menu