అల్లు అర్జున్ లైనప్ అదిరింది!

అల్లు అర్జున్ లైనప్ అదిరింది!
X
'పుష్ప 2' విజయం అల్లు అర్జున్‌కు అపారమైన పాన్-ఇండియా క్రేజ్‌ను తీసుకొచ్చింది. దక్షిణాది నుంచి ఉత్తరాదివరకు బన్నీ స్టార్‌డమ్‌ భారీగా విస్తరించింది.

'పుష్ప 2' విజయం అల్లు అర్జున్‌కు అపారమైన పాన్-ఇండియా క్రేజ్‌ను తీసుకొచ్చింది. దక్షిణాది నుంచి ఉత్తరాదివరకు బన్నీ స్టార్‌డమ్‌ భారీగా విస్తరించింది. బాలీవుడ్ టాప్ స్టార్స్ కు ధీటుగా ఇప్పుడు అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు.

ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా తర్వాత బన్నీ కిట్టీలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కన్నడ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో అల్లు అర్జున్ ఒక సినిమా చేయనున్నాడని లేటెస్ట్ గా కన్ఫమ్ అయ్యింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు వీరిద్దరి కాంబోని సెట్ చేస్తున్నాడు.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో అల్లు అర్జున్ సినిమా చేయనున్నాడనే న్యూస్ చాన్నాళ్లుగా వినిపిస్తుంది. ఇప్పటికే వీరిద్దరి పలు మీటింగ్స్ జరిగాయి. ఈ ప్రాజెక్ట్‌ను గీతా ఆర్ట్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించడానికి సిద్ధమవుతుంది. త్వరలోనే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట.

మరోవైపు మలయాళ నటుడు-దర్శకుడు బాసిల్ జోసెఫ్ తెరకెక్కించనున్న 'శక్తిమాన్'లో అల్లు అర్జున్ హీరోగా నటించనున్నాడనే ప్రచారం జరిగింది. సోనీ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనుందనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో టి-సిరీస్ ఒక చిత్రాన్ని అనౌన్స్ చేసింది. మొత్తంగా.. ఈ లిస్టు చూస్తుంటే అల్లు అర్జున్ లైనప్ మునుముందు మరింత క్రేజీగా మారబోతుందని అర్థమవుతుంది.

Tags

Next Story