అల్లు అర్జున్ ఎంట్రీ అదుర్స్

అల్లు అర్జున్ ఎంట్రీ అదుర్స్
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో అమితమైన క్రేజ్ నెలకొంది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌గా తన ఇమేజ్‌ను పెంచుకున్న బన్నీ, అట్లీ మూవీతో సరికొత్త రికార్డులు కొల్లగొడతాడనే అంచనాలున్నాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో అమితమైన క్రేజ్ నెలకొంది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌గా తన ఇమేజ్‌ను పెంచుకున్న బన్నీ, అట్లీ మూవీతో సరికొత్త రికార్డులు కొల్లగొడతాడనే అంచనాలున్నాయి. సన్ పిక్చర్స్ సంస్థపై కళానిధి మారన్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎంట్రీ కోసం ప్రత్యేకంగా భారీ సెట్స్ వేసినట్లు సమాచారం. ఈ సీక్వెన్స్‌లో బన్నీ గెటప్ పూర్తిగా కొత్తగా ఉండబోతోందట. అంతేకాదు, ఈ సన్నివేశంలో దాదాపు 300 మంది జూనియర్స్ పాల్గొంటారని, ఇది యాక్షన్ సీక్వెన్స్ అయి ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. అభిమానుల కోసం ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్‌ను డిజైన్ చేశారని ఫిల్మ్ నగర్‌లో చర్చ నడుస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొనే ఇప్పటికే ఫిక్స్ కాగా, మరో ముగ్గురు హీరోయిన్లు రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా నటించనున్నారని వినిపిస్తుంది. లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్‌లోకి సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఆన్‌బోర్డులోకి వచ్చిందట.

‘బాహుబలి’లోని రాజమాత శివగామి పాత్ర తరహాలోనే ఎంతో ప్రాముఖ్యత గల పాత్రలో ఈ సినిమాలో అలరించనుందట రమ్యకృష్ణ. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీని పాన్ వరల్డ్ రేంజులో తీర్చిదిద్దుతున్నాడు అట్లీ. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా ఆడియన్స్ ముందుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.

Tags

Next Story