ఇద్దరూ తగ్గేదే లే!

ఈ దసరా సెలవుల్లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఖాయం. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘అఖండ 2 తాండవం’, పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ చిత్రాలు క్లాష్ కు రెడీ అవుతున్నాయి. సెప్టెంబర్ 25న ఈ రెండు సినిమాలూ ఒకేసారి విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ఇప్పటికే 'ఓజీ' షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరోవైపు 'అఖండ 2' చిత్రీకరణ చివరి షెడ్యూల్ భద్రాచలంలో జరుపుకుంటోంది. లేటెస్ట్‌గా బోయపాటి శ్రీను మీడియాతో మాట్లాడుతూ.. ఒక పాట మినహా సినిమా మొత్తం షూటింగ్ పూర్తయిందని, సెప్టెంబర్ 25న నందమూరి అభిమానులకు పండుగే అని ప్రకటించాడు. దీంతో ఇటు 'అఖండ 2', అటు 'ఓజీ' ఇద్దరూ రిలీజ్ డేట్స్ విషయంలో తగ్గేదే లే అంటున్నారు. ముందుగానే షూటింగ్ పూర్తి చేసి, ప్రమోషన్లకు కూడా మేకర్స్ రెడీ కావడంతో.. ఈ దసరా బరిలో నందమూరి-మెగా క్లాష్ తప్పదనే సంకేతాలు అందుతున్నాయి.
మరోవైపు ఈ ఏడాది ప్రథమార్థంలో పెద్ద సినిమాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకుల్లో కొంత అసంతృప్తి కనిపించగా.. సెకండ్ హాఫ్‌లో మాత్రం వరుసగా క్రేజీ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇప్పటికే 'హరిహర వీరమల్లు' విడుదల కాగా, 'కింగ్డమ్, కూలీ, వార్ 2, అఖండ 2, ఓజీ' చిత్రాలు రిలీజ్ కు లైన్లో ఉన్నాయి. ఇక.. వీటిలో ఆగస్టు 14న 'వార్ 2 వర్సెస్ కూలీ', సెప్టెంబర్ 25న 'అఖండ 2 వర్సెస్ ఓజీ' క్లాషెస్ సమ్‌థింగ్ స్పెషల్ గా నిలవబోతున్నాయి.
-
Home
-
Menu