‘అఖండ 2‘ రిలీజ్ డేట్ ఫిక్స్

‘అఖండ 2‘ రిలీజ్ డేట్ ఫిక్స్
X
నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే మాస్ ఆడియన్స్‌కి ప్రత్యేక క్రేజ్‌. ఇప్పటికే ‘సింహా, లెజెండ్, అఖండ‘ వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన ఈ జోడీ, ఇప్పుడు నాలుగోసారి ‘అఖండ 2: తాండవం’తో వస్తోంది.

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే మాస్ ఆడియన్స్‌కి ప్రత్యేక క్రేజ్‌. ఇప్పటికే ‘సింహా, లెజెండ్, అఖండ‘ వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన ఈ జోడీ, ఇప్పుడు నాలుగోసారి ‘అఖండ 2: తాండవం’తో వస్తోంది. ఈ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ అసలు దసరా బరిలో రిలీజవ్వాల్సి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో వాయిదా పడింది. ఇక ఈరోజు దసరా సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

డిసెంబర్ 5 ‘అఖండ 2‘ గ్రాండ్‌ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో బాలయ్య పొడవాటి జుట్టు, గడ్డం, రుద్రాక్షలతో గంభీరంగా కనిపిస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాడు. ఈ పోస్టర్ లో బాలయ్య చేతిలో త్రిశూలం, వెనక మంచు వాతావరణం ఇవన్నీ ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో చెబుతున్నాయి.

‘అఖండ‘ సీక్వెల్ గా వస్తోన్న ఈ సినిమా కథ సనాతన ధర్మ పరిరక్షణ చుట్టూ తిరుగనుంది. ఒకవైపు భక్తి, ఆధ్యాత్మికతను చూపిస్తూనే మరోవైపు మాస్ యాక్షన్‌ను చూపించబోతున్నాడట బోయపాటి. సంజుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నాడు. తమన్ అందిస్తున్న సంగీతం ఈ చిత్రానికి టెక్నికల్ గా మరో ప్లస్ పాయింట్. పాన్ ఇండియా లెవెల్ లో పలు భాషల్లో ‘అఖండ 2‘ రెడీ అవుతుంది.



Tags

Next Story