వాయిదా పడ్డ 'అఖండ 2'

వాయిదా పడ్డ అఖండ 2
X
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ మోస్ట్ అవైటింగ్ మూవీ 'అఖండ 2'. బ్లాక్‌బస్టర్ మూవీ 'అఖండ'కి సీక్వెల్ గా రూపొందుతున్న సినిమా ఇది. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ చిత్రం రావాల్సి ఉంది.

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ మోస్ట్ అవైటింగ్ మూవీ 'అఖండ 2'. బ్లాక్‌బస్టర్ మూవీ 'అఖండ'కి సీక్వెల్ గా రూపొందుతున్న సినిమా ఇది. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ చిత్రం రావాల్సి ఉంది. అయితే.. లార్జ్ స్కేల్ లో రూపొందుతున్న ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఇంకా పూర్తి కాలేదట. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయించడం వలనే 'అఖండ 2'ని వాయిదా వేయబోతున్నామని అధికారికంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ సంస్థ.

ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న బాలకృష్ణ-బోయపాటి కలయికలో వస్తోన్న సినిమా ఇది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుంది. 'అఖండ' మొదటి భాగానికి అత్యద్భుతమైన మ్యూజిక్ అందించిన తమన్.. సీక్వెల్ కి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. త్వరలోనే 'అఖండ 2' కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారట మేకర్స్.



Tags

Next Story