డిసెంబర్ లోనే ‘అఖండ 2’?

డిసెంబర్ లోనే ‘అఖండ 2’?
X
నాలుగేళ్ల క్రితం ‘అఖండ’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబో ఇప్పుడు మరోసారి అదే మ్యాజిక్ చూపించేందుకు సిద్ధమవుతోంది.

నాలుగేళ్ల క్రితం ‘అఖండ’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబో ఇప్పుడు మరోసారి అదే మ్యాజిక్ చూపించేందుకు సిద్ధమవుతోంది. భారీ అంచనాలు నెలకొన్న ‘అఖండ 2: తాండవం’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. అసలు దసరా బరిలోనే విడుదలవ్వాల్సిన ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా వాయిదా పడింది. లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చిందనే న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.

డిసెంబర్ 5నే 'అఖండ 2' రిలీజ్ డేట్‌ లాక్ చేసినట్లు చిత్ర బృందం సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. నవంబర్ మొదటివారానికల్లా అన్ని పనులు పూర్తవుతాయని, అప్పటి నుంచి జనవరికి హోల్డ్ చేయడం సరికాదనే నిర్ణయానికి బాలయ్య–బోయపాటి వచ్చినట్టు తెలుస్తోంది. పైగా గతంలో 'అఖండ' చిత్రం కూడా డిసెంబర్ నెలలోనే వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.

ఈ చిత్రంలో బాలయ్య రెండు పవర్‌ఫుల్ రోల్స్ లో అలరించబోతుండగా, సంయుక్త హీరోయిన్‌గా, ఆది పినిశెట్టి విలన్ పాత్రలోనూ కనిపించబోతున్నారు. తమన్ సంగీతం ఈ చిత్రానికి టెక్నికల్ గా హైలైట్ కానుంది. డిసెంబర్ 5న ‘అఖండ 2: తాండవం’ థియేటర్లలోకి వస్తే, నందమూరి అభిమానులకు ఇది నిజంగా పండుగే!

Tags

Next Story