బంద్ పేరుతో పవన్ కి ‘రిటర్న్ గిఫ్ట్’?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు‘ సినిమా జూన్ 12న విడుదలవుతుంది. అయితే.. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ అనే ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు‘ విడుదల సందర్భంగా.. కావాలనే కొంతమంది బంద్ పేరుతో వ్యూహం పన్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఈనేపథ్యంలో తెలుగు చిత్రసీమ బంద్ పేరుతో తనకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు అంటూ పవన్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వచ్చింది. సినిమా రంగంలో ఉన్న లోటుపాట్లుపై చర్చిస్తూ ఈ ప్రకటన సాగింది. ఇందులో సినిమా రంగానికి పరిశ్రమ హోదా, సినీ సంఘాల నిర్లక్ష్యంపై అసంతృప్తి, గత ప్రభుత్వ వేధింపులు, థియేటర్ల పరిశీలన నైపుణ్యాల అభివృద్ధిపై వంటి అంశాలను ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రంగానికి ప్రత్యేక పరిశ్రమ హోదా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని.. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలో చర్చించి, సమగ్ర ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీ ప్రకటించనున్నారని ఈ ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వంతో వ్యక్తిగతంగా కాక, సినిమా సంఘాల ప్రతినిధులుగా కలవాలని సూచించినా ప్రతిస్పందన రాలేదని ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్టు ఈ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం వ్యక్తులపై కాక, పరిశ్రమపై దృష్టి సారిస్తుందన్నారు.
మరోవైపు గత ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖులు, నిర్మాణ సంస్థలు ఎదుర్కొన్న అవమానాలను చిత్ర పరిశ్రమ మర్చిపోకూడదని గుర్తు చేశారు. కక్ష సాధింపులు, థియేటర్ల వద్ద తనిఖీల అంశాలను ప్రస్తావించారు. లీజుదారుల నిర్వహణలో ఉన్న థియేటర్ల ఆదాయం, పన్నుల చెల్లింపుపై సమీక్ష జరుగుతుందని ఈ లేఖలో ప్రస్తావించారు.
అలాగే మల్టీప్లెక్స్ థియేటర్ల టికెట్ ధరలు, ఫుడ్ ధరలపై దృష్టి పెట్టనున్నారు. ఇంకా సినిమా రంగాన్ని పూర్తి పరిశ్రమగా అభివృద్ధి చేయాలంటే 24 విభాగాల్లో నైపుణ్యాలు పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం శిక్షణ శిబిరాలు, సింపోజియమ్స్ నిర్వహించనున్నట్టు ప్రస్తావించారు.
24-5-25
— L.VENUGOPAL🌞 (@venupro) May 24, 2025
*(ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన)*
*తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు*
•ఆంధ్రప్రదేశ్ లో ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారా?
•గత ప్రభుత్వం…
-
Home
-
Menu