రామ్ రాసిన ప్రేమగీతం

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ పి. మహేష్ బాబు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ డ్యూయో వివేక్-మెర్విన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి హీరో రామ్ రాసిన ప్రేమగీతం 'నువ్వుంటే చాలే' విడుదలైంది.
ఈ పాటను కోలీవుడ్ రాక్‌స్టార్ అనిరుధ్ ఆలపించడం విశేషం. 'నాకే తెలియని నాలో యుద్ధమా.. లోలోన సంద్రమా..' అంటూ సాగిన పదాలు రచయితగా రామ్ కొత్త కోణాన్ని చూపించాయి. రామ్-భాగ్యశ్రీ మధ్య చిత్రీకరించిన ఈ లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. ఓ వీరాభిమాని బయోపిక్ అని ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మొత్తంగా.. ఫస్ట్ సింగిల్ తోనే 'ఆంధ్రా కింగ్ తాలూకా'పై అంచనాలు పెరిగాయి.
-
Home
-
Menu