మైత్రీ మూవీస్ పై భారీ రిస్క్?

మైత్రీ మూవీస్ పై భారీ రిస్క్?
X
గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు నితిన్. 2017 నుండి ఇప్పటివరకు చేసిన 11 సినిమాల్లో ‘భీష్మ‘ ఒక్కటే హిట్ కాగా, ‘మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రార్డినరీ మెన్, రాబిన్ హుడ్, తమ్ముడు‘ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కొత్త కథలు వింటున్నాడు.

ఈకోవలోనే సీనియర్ డైరెక్టర్ శ్రీను వైట్ల కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ టాక్. ‘దూకుడు, రెడీ, బాద్‌షా‘ వంటి సూపర్‌హిట్‌లను అందించిన శ్రీను వైట్లకు కూడా గత కొన్నేళ్లుగా వరుస ఫెయిల్యూర్లు తప్పలేదు. ఆయన గత చిత్రం ‘విశ్వం‘ ఏవరేజ్ గా నిలిచింది.

నితిన్-శ్రీను వైట్ల కాంబోలో సినిమాని టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ సెట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే.. నితిన్-శ్రీను వైట్ల కాంబోలో సినిమా అనగానే ‘డిజాస్టర్ హీరో – డిజాస్టర్ డైరెక్టర్‘ కాంబినేషన్ వర్కవుట్ అవుతుందా? అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మొత్తంగా.. హిట్ కొడితే ఇద్దరికీ తిరిగి బంగారు రోజులు మొదలయ్యే అవకాశం ఉంది. లేదంటే ఇంకో పెద్ద షాక్ తప్పదని సినీ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.

Tags

Next Story