‘మిరాయ్’ ట్రైలర్.. ఇదొక విజువల్ వండర్!

తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని రూపొందిస్తున్న పాన్-ఇండియా ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా ‘మిరాయ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదలవుతోంది. ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలతో మంచి బజ్ ఏర్పరచుకున్న ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజయ్యింది.
ట్రైలర్ చూస్తే.. ఇదొక విజువల్ వండర్ లా అనిపిస్తుంది. త్రేతా యుగానికి, కలి యుగానికి లింక్ పెడుతూ ఓ మైథలాజికల్ సోషియో ఫాంటసీని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నాడు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని. ఇప్పటికే టీజర్ తో అంచనాలను పెంచుకున్న 'మిరాయ్'.. ఇప్పుడు ట్రైలర్ తో ఆ అంచనాలను మరో లెవెల్ లో నిలబెట్టిందని చెప్పొచ్చు. ఇందులో శ్రీరాముని దర్శనం, డ్రాగన్ వంటి అంశాలు ట్రైలర్ కి అదనపు ఆకర్షణగా నిలిచాయి.
'హనుమాన్'తో పాన్ ఇండియా స్టార్ గా మారిన తేజ సజ్జ.. 'మిరాయ్'తో తన ఇమేజ్ ను మరో లెవెల్ లో నిరూపించునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విలన్ గా మంచు మనోజ్ కి ఈ చిత్రం ఓ టర్నింగ్ పాయింట్ కావొచ్చు. రితిక నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో జగపతిబాబు, జయరాం, శ్రీయ కీలక పాత్రల్లో కనువిందు చేయబోతున్నారు.
అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాల్లో కూడా ఈ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ ను ఎక్స్‌పెక్ట్ చేయలేం. అలాంటిది తక్కువ బడ్జెట్ లోనే ఓ విజువల్ స్పెక్టాకిల్ ను ఆన్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతుంది 'మిరాయ్' టీమ్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ కమ్ సినిమాటోగ్రఫీ, గౌర హరి మ్యూజిక్ టెక్నికల్ గా ఈ మూవీకి ఎంతో ప్లస్ పాయింట్స్. మొత్తంగా.. సెప్టెంబర్ 12న పాన్ ఇండియా లెవెల్ లో హాట్ ఫేవరెట్ గా థియేటర్లలోకి దిగబోతుంది 'మిరాయ్'.
-
Home
-
Menu